Header Banner

ఈ ఓటీటీ వేదికలో ఇక వాణిజ్య ప్రకటనల హోరు! అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో..

  Sun Jun 15, 2025 13:38        Entertainment

ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటి వరకు ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే, తాజాగా దీనిపై మరికొన్ని సవరణలు చేసినట్లు తెలుస్తోంది. తాజా నిబంధనల ప్రకారం, ప్రతి గంటకు ఆరు నిమిషాల పాటు ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది. ప్రకటనలతో కూడిన కంటెంట్‌ను చూడటానికి అభ్యంతరం లేని వారు ప్రస్తుత ప్లాన్‌లోనే కొనసాగవచ్చని వెల్లడించింది. ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారు నెలకు రూ.129, సంవత్సరానికి రూ.699 అదనపు రుసుముతో కొత్త ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ పేర్కొంది. భారత ఓటీటీ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెజాన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ వంటి కొన్ని ప్రధాన వేదికలు ఇప్పటికే ప్రకటనలు లేని సేవలను అందిస్తున్నాయి. అమెజాన్ తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారులను ఇతర వేదికల వైపు ఆకర్షించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Amazon Prime #Amazon Prime Video #OTT platforms #India #web series #streaming services #online video #streaming #advertisements #subscription plans #Netflix #OTT market